: మాది బీసీ కమిషన్ మాత్రమే, కాపు కమిషన్ కాదు: జస్టిస్ మంజునాథ్


బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథను బీసీ సంఘాల నేతలు ఈ రోజు విజయవాడలో కలిశారు. కాపులను బీసీ జాబితాలో కలపొద్దని విజ్ఞప్తి చేశారు. కాపులను బీసీ జాబితాలో చేరిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని సంఘాల నేతలు వాపోయారు. ఈ సందర్భంగా జస్టిస్ మంజునాథ్ స్పందిస్తూ.. ‘మాది బీసీ కమిషన్ మాత్రమే, కాపు కమిషన్ కాదు. నేను కాపు రిజర్వేషన్లపై రిపోర్ట్ ఇవ్వడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే, బీసీల ఆర్థిక స్థితిగతులపై అధ్యయనం జరుగుతోంది. త్వరగా రిపోర్ట్ ఇవ్వాలని మమ్మల్ని ఏపీ కేబినెట్ అడగలేదు. రాజకీయ పరమైన అంశాలతో మాకు సంబంధం లేదు’ అని బీసీ సంఘాల నేతలకు స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News