: తన కిడ్నీపై ఆటోగ్రాఫ్ ఇవ్వమని.. బాలీవుడ్ హీరోయిన్ ని అడిగిన వీరాభిమాని!
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌కి విచిత్రమైన అనుభవం ఎదురైంది. తన ఎడమ కిడ్నీపై శ్రద్ధాకపూర్ ఆటోగ్రాఫ్ కావాలని ఓ అభిమాని ఆమెను అడిగాడు. ప్రస్తుతం శ్రద్ధా కపూర్ ‘హసీనా: ది క్వీన్ ఆఫ్ ముంబయి’ చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా శ్రద్ధా కపూర్ తన అభిమానులు ట్విట్టర్‌లో అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఇలా ఆటోగ్రాఫ్ అడిగాడు. దీంతో శ్రద్ధాకపూర్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేదు.. చివరకు పేపర్ మీద మాత్రమే ఇస్తానని చెప్పింది. ఆమె నటిస్తోన్న ‘హసీనా: ది క్వీన్ ఆఫ్ ముంబయి’ సినిమా వచ్చేనెల 18న విడుదల కానుంది.