: జియో ఫోన్ ముందస్తు బుకింగ్స్, ఫోన్ డెలివరీ వివరాలు!


రూ. 1500 సెక్యూరిటీ డిపాజిట్ తో తాము విడుదల చేసిన సరికొత్త 4జీ వీఓఎల్టీఈ ఆధారిత ఫోన్ ను ఏ భారతీయుడైనా ఆగస్టు 24 నుంచి ముందస్తు బుకింగ్స్ చేసుకోవచ్చని ముఖేష్ అంబానీ తెలిపారు. ఆగస్టు 15 నుంచి ఈ ఫోన్ సేవలు ప్రారంభమవుతాయని, తొలి దశలో ప్రయోగాత్మక పరిశీలనలు జరపాలని నిర్ణయించామని, అందుకోసం ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ ఫోన్లను అందుబాటులోకి తెస్తామని అన్నారు.

ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా అనే ప్రాతిపదికన సెప్టెంబర్ నుంచి ఫోన్లను అందిస్తామని ప్రకటించారు. అక్టోబరు నుంచి జియో కొత్త ఫోన్ల తయారీ ఇండియాలో జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం నూతన ప్లాంటు సిద్ధమైందని తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపాలన్న తన లక్ష్యం వెనుక లక్షలాది మంది రిలయన్స్ ఉద్యోగుల శ్రమ ఉందని, వారందరి సహకారంతో తాను సరికొత్త వరల్డ్ రికార్డులను నమోదు చేస్తానన్న నమ్మకముందని అన్నారు.

  • Loading...

More Telugu News