: కిరణ్ బేడీని హిట్లర్ తో పోలుస్తూ పుదిచ్చేరిలో పోస్టర్లు.. కేంద్రం సీరియస్!
పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడికి మధ్య రోజురోజుకూ సంబంధాలు దిగజారుతున్నాయి. వివాదం అంతకంతకూ పెరుగుతోంది. జూలై 4వ తేదీన ముగ్గురు నేతలను కేంద్రం ఎమ్మెల్యేలుగా నామినేట్ చేసింది. వారితో కిరణ్ బేడీ ప్రమాణస్వీకారం చేయించడం పుదుచ్చేరి రాజకీయవర్గాల్లో సంచలనం రేపింది. కిరణ్ బేడీ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై ఎదురుదాడికి దిగుతున్నారు. కిరణ్ బేడీని జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ లా చూపిస్తూ, కాంగ్రెస్, ఆ పార్టీ మిత్ర పక్షాలు అభ్యంతరకర పోస్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పోస్టర్లో కిరణ్ బేడీకి హిట్లర్ లా మీసం పెట్టి ఆమెను అవమానించారు. మరోవైపు, కిరణ్ బేడీనీ ఇలా చూపించడం పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టు సమాచారం.