: బడ్జెట్ ధరలో ఐవూమీ నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు.. ఆకట్టుకునే ఫీచర్లు!
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఐవూమీ గురువారం భారత మార్కెట్లోకి బడ్జెట్ ధరల్లో రెండు స్మార్ట్‌ఫోన్లు విడుదల చేసింది. మీ4, మీ5 పేర్లతో విడుదల చేసిన ఈ ఫోన్లు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
ఫీచర్ల విషయానికి వస్తే మీ4లో 4.5 అంగుళాల డిస్‌ప్లే ఉండగా, మీ5లో 5 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌ను ఉపయోగించారు. ఇక మీ4లో 1జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, ముందు, వెనక 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. మీ5లో 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, వెనక 8 ఎంపీ, ముందు 5 ఎంపీ కెమెరా ఉన్నాయి.