: పది గంటలకు సిట్ ముందుకు యాక్టర్ సుబ్బరాజు


హైదరాబాదులో వెలుగు చూసిన డ్రగ్స్ దందా కేసులో మొన్న పూరీ జగన్నాథ్ ను, నిన్న శ్యామ్ కే నాయుడును విచారించిన పోలీసులు, నేడు పూరీ బ్యాచ్ లోని సుబ్బరాజును విచారించనున్నారు. విలన్ గా సినీ రంగప్రవేశం చేసిన సుబ్బరాజు వివిధ రకాల పాత్రలతో టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే కెల్విన్ డ్రగ్ దందాలో సంబంధాలు ఉన్నాయన్న వార్తలు రాగానే తనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని, తాను డ్రగ్స్ తీసుకోనని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి ఉదయం 10 గంటలకు తన లాయర్ తో కలిసి సుబ్బరాజు సిట్ కార్యాలయానికి చేరుకోనున్నాడు. అక్కడ అతనిని సిట్ అధికారులు విచారించనున్నారు. 

  • Loading...

More Telugu News