: డ్రగ్స్ ఎందుకు వాడుతారో కూడా తెలియదని శ్యామ్ కే నాయుడు అనగానే... పెద్దగా నవ్వేసిన సిట్ అధికారులు!
డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖులను విచారిస్తున్న పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు పూరీ జగన్నాథ్ ను విచారించిన సిట్ అధికారులు. నిన్న శ్యామ్ కే నాయుడును విచారించారు. తనకు సిగిరెట్ తాగే అలవాటు కూడా లేదని, డ్రగ్స్ ఎందుకు వాడుతారో కూడా తెలియదని చెప్పగానే విచారణలో ఉన్న అధికారులంతా పెద్దగా నవ్వేశారు. అనంతరం తమకు అంతా తెలుసని, ఎవరు ఏం తీసుకుంటారో, తీసుకోరో కూడా తమకు తెలుసని వారు చెప్పారు.
అందుకు సంబంధించిన వివరాలు అతని ముందు పెట్టడంతో....అవాక్కైన శ్యామ్ కే నాయుడు, సినిమా షూటింగ్ సమయంలో తాను డ్రగ్స్ చూశానని చెప్పగా, ఒక పార్టీలో ఆయన ఉన్న ఫోటోలు కూడా చూపించడంతో శ్యామ్ కే నాయుడు కొన్ని వివరాలు అందించక తప్పలేదని తెలుస్తోంది. పూరీ బ్యాచ్ లోని కొందరు డ్రగ్స్ తీసుకుంటారని, ఆయన పేర్లతో సహా వివరించినట్టు తెలుస్తోంది. దీంతో విచారణ అనంతరం అతని చేతి, కాలి వేలి గోళ్లతోపాటు వెంట్రుకలు కూడా తీసుకుని విశ్లేషణకు పంపినట్టు తెలుస్తోంది.