: రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ నేత కేశవరావుకు అస్వస్థత.. నిమ్స్‌కు తరలింపు
టీఆర్ఎస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఉండగా ఆయన అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆయనను నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడే ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.