: రాత్రి సమయంలో స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా?.. వద్దని హెచ్చరిస్తోన్న పరిశోధకులు
రాత్రి సమయంలో పడుకోబోయేముందు స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా?.. అయితే, ఆ అలవాటును మానుకోవాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. రాత్రి పడుకోబోయే ముందు కాస్త తీరిక సమయం దొరకడంతో ఎంతో మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు మంచంపై పడుకోనే ప్రెండ్స్‌తో చాటింగ్ చేయడం, ఫోన్ చేసి మాట్లాడడం వంటివి చేస్తుంటారు.
ఈ అలవాటుతో నిద్రలేమి, కంటిచూపు దెబ్బతినడం వంటి ప్రమాదాలు ఉంటాయని సుమారు వెయ్యి మంది మీద అధ్యయనం చేసిన తరువాత ఆస్ట్రేలియా పరిశోధకులు వివరించారు. పడుకోబోయే ముందు స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తే గాఢనిద్ర పట్టదని తెలిపిన పరిశోధకులు... దాంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కుంటారని చెబుతున్నారు. చీకట్లో ఛాటింగ్ చేస్తే కంటి రెటీనా మీద ప్రభావం పడుతుందని తెలిపారు. రాత్రుళ్లు స్మార్ట్‌ఫోనును దూరంగా పెట్టి నిద్రపోవాలని చెబుతున్నారు.