: జగన్ పిటిషన్ ను కొట్టేస్తామన్న హైకోర్టు... వెంటనే ఉపసంహరించుకున్న వైసీపీ అధినేత!
అక్రమాస్తులపై తనపై ఉన్న సీబీఐ కేసులన్నీ కలిసికట్టుగా విచారించాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వైసీపీ అధినేత జగన్ ఉపసంహరించుకున్నారు. అభియోగాల ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో జగతి పబ్లికేషన్స్ సంస్థ ఈ పిటిషన్ వేయడం సబబు కాదని సీబీఐ గట్టిగా వాదించింది. దీంతో, ఆ పిటిషన్ ను కొట్టి వేసేందుకు హైకోర్టు సిద్ధమవడంతో, తామే స్వచ్చందంగా ఉపసంహరించుకుంటున్నామని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కాగా, గత ఆరు నెలలుగా హైకోర్టులో ఈ వ్యాజ్యంపై విచారణ జరిగింది. ఇకపై జగన్ కేసుల విచారణ రోజువారీగా జరిగే అవకాశం ఉంది.