: మా చిట్టితల్లి సంతోషంగా ఉండాలి: మహేశ్‌బాబు దంపతులు
ప్రముఖ హీరో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల గారాలపట్టి సితార బర్త్ డే ఈ రోజు. ఈ సందర్భంగా మహేశ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ, సితారతో రోజూ తనకు ప్రత్యేకమేనని, ఈ రోజు సితార పుట్టినరోజని, మరింత ప్రేమ, అనంతమైన సంతోషంతో చిన్నారి ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు మహేశ్ తెలిపాడు. సితారతో ఉన్న ఫొటోలను మహేశ్ పోస్ట్ చేశాడు. కాగా, సితార తల్లి నమ్రతా శిరోద్కర్ కూడా ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో తన సోదరి ఒళ్లో కూర్చుని ఉన్న సితార, తన గోరింటాకు చేతులను చూపిస్తూ ఫొటోకు పోజ్ ఇచ్చింది. ‘సితార 5వ పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటగా తన సోదరితో దిగిన ఫొటో... లవ్ యూ మోర్... సంతోషంగా ఉండాలి’ అంటూ నమ్రతా తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో పేర్కొన్నారు.