: తిరుమల కొండపై సచిన్.. చూసేందుకు ఎగబడ్డ జనం
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నేడు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నాడు. తన భార్య అంజలితో కలసి ఆయన స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ దంపతులకు ఆలయ అధికారులు స్వాగతం పలికి, ఆలయంలోకి తీసుకెళ్లారు. దర్శనానంతరం వారికి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా సచిన్ ను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. సచిన్ తో పాటు ఆయన మిత్రుడు చాముండేశ్వరినాథ్, నిమ్మగడ్డ ప్రసాద్ లు కూడా వెంకన్న దర్శనం చేసుకున్నారు.