: నేడు శ్యామ్ కే నాయుడు వంతు... సిట్ ఆఫీసుకు బయలుదేరిన సినిమాటోగ్రాఫర్
టాలీవుడ్ ను కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంలో విచారణ వేగవంతమైన వేళ, నిన్న పూరీ జగన్నాథ్ విచారణను ఎదుర్కోగా, నేడు సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడిని అధికారులు విచారించనున్నారు. ప్రస్తుతం శ్యామ్ కే నాయుడు తన ఇంటి నుంచి సిట్ ఆఫీసుకు బయలుదేరాడు. కెల్విన్ సహా మరో ముగ్గురు నిందితుల సెల్ ఫోన్లలో శ్యామ్ కే నాయుడు నంబర్ ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు పూరీ జగన్నాథ్ నుంచి శ్యామ్ కే నాయుడు డ్రగ్స్ తీసుకున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే శ్యామ్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ ఉదయం 10.30 గంటల నుంచి ఆయన పోలీసులు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పాల్సి వుంటుంది. కాగా, డ్రగ్స్ వ్యవహారంలో శ్యామ్ కస్టమర్ గా మాత్రమే ఉన్నట్టు సిట్ వర్గాలు చెబుతుండటంతో, ఈ విచారణ గంటల కొద్దీ సాగక పోవచ్చని అంచనా.