: నాయకులు పోతే కార్యకర్తలే నాయకులౌతారు: బాబు వ్యాఖ్య
సీనియర్ నేత దాడి వీరభద్రరావు పార్టీని వీడిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. నాయకులు పోతే కార్యకర్తలే నాయకులుగా ఎదుగుతారని బాబు వ్యాఖ్యానించారు. దాడికి పార్టీలో తాము ఎంతో ప్రాధాన్యమిచ్చామని, ఎమ్మెల్సీ కాకపోయినా మరో పదవి ఇస్తామని చెప్పినా ఆయన వినిపించుకోలేదని బాబు చెప్పారు. దాడి తీవ్ర నిరాశలో కూరుకుపోయినట్టుందని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము అనుమతిస్తే పార్టీలోకి వచ్చేందుకు మరెందరో సిద్ధంగా ఉన్నారని బాబు అన్నారు.