: విచారణకు పూరీ జగన్నాథ్ సహకరించారు: సిట్ అధికారులు
డ్రగ్స్ వ్యవహారంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ ను సిట్ అధికారులు సుమారు పదకొండు గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, విచారణకు పూరీ జగన్నాథ్ సహకరించారని, తాము అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారని చెప్పారు. ఈ వ్యవహారానికి సంబంధించి పూరీ కొన్ని క్లూస్ ఇచ్చారని, విచారణలో మరిన్ని ఆధారాలు దొరికాయని చెప్పారు. పూరీ అనుమతితో రక్త నమూనాలు సేకరించామని, శాంపిల్స్ వచ్చిన తర్వాత మాట్లాడతామని తెలిపారు.