: అప్పట్లో చిరంజీవి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి.. తీసేశారు!: నటి ఆమని
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి తాను ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, ఆ ప్రాజెక్టులో నుంచి తనను తీసేశారని ఆమని పేర్కొంది. `ముందు అమెరికాలో పరుచూరి బ్రదర్స్ వారి టూర్‌కి నేను ఒప్పుకున్నాను. ఆ తర్వాత చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. దీంతో నెలరోజులు కాల్షీట్లు ఇచ్చిన పరుచూరి టూర్‌ను నేను రద్దు చేసుకున్నాను. తీరా వెళ్లి చూస్తే చిరంజీవి సినిమాలో నుంచి నన్ను తీసేశారని తెలిసింది. దీంతో అటు టూరు, ఇటు మెగాస్టార్ పక్కన హీరోయిన్ అవకాశం రెండు కోల్పోయాను` అని ఆమని వివరించింది.