: నా కూతురు కలత చెందింది.. పూరి జగన్నాథ్ నిర్దోషిగా బయటకు వస్తాడు: నటి ఛార్మి తండ్రి
డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న ఛార్మి సిట్ విచారణను ఎదుర్కోబోతోంది. ఈ నేపథ్యంలో ఆమె తండ్రి దీప్ సింగ్ ఉప్పల్ మాట్లాడుతూ, డ్రగ్స్ ఆరోపణలతో తన కుమార్తె ఎంతో కలత చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 13 ఏళ్ల వయసు నుంచే ఛార్మి సినీ రంగంలో తన ప్రతిభను చాటుతోందని... చిన్న వయసు నుంచే కుటుంబానికి అండగా ఉంటోందని అన్నారు. ఒకవేళ ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉంటే... ఇంత కాలం పాటు సినీ పరిశ్రమలో కొనసాగేదా? అని ప్రశ్నించారు. ఒకరి గురించి తప్పుడు వార్తలు రాయడం సరైంది కాదని... ఏదైనా రాసేటప్పుడు వారి కుటుంబాలను దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు.
పూరీ జగన్నాథ్ ఓ అద్భుతమైన దర్శకుడని... డ్రగ్స్ వ్యవహారంలో ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని దీప్ సింగ్ చెప్పారు. ఛార్మీ ప్రస్తుతం పైసా వసూల్ సినిమా నిర్మాణం పనులతో బిజీగా ఉందని తెలిపారు.