: ప్రియాంక పరువు తీసేందుకు ప్రయత్నించిన మాజీ ప్రియుడు
ప్రస్తుతం అంతర్జాతీయ తారగా వెలిగిపోతున్న ప్రియాంక చోప్రా ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో తన ఎదుగుదలను తట్టుకోలేక మాజీ ప్రియుడు అసీం మర్చెంట్, ప్రియాంక పరువు తీసేందుకు ప్రయత్నించినట్లు ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. ప్రియాంక మోడల్‌గా నిలదొక్కుకుంటున్న రోజుల్లో అసీంతో ప్రేమలో పడింది. తర్వాత తాను మిస్ ఇండియాగా ఎంపికవడంతో మోడలింగ్‌తో పాటు సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. వాటితో బిజీ అయిపోయిన ప్రియాంక అసీంను పట్టించుకోవడం మానేసింది.
ఇది సహించలేక పీసీకి సంబంధించిన వ్యక్తిగత విషయాలన్నీ బయటపెట్టేందుకు అసీం ప్రయత్నించాడని ఆంగ్ల పత్రిక పేర్కొంది. ఇందుకోసం ప్రియాంక మేనేజర్ ప్రకాశ్ ఝా పేరును వాడుకోవాలని చూశాడు. ఒకప్పుడు ప్రియాంకను బెదిరించిన కేసులో 67 రోజుల పాటు జైలు పాలైన ప్రకాశ్ ఝా జీవిత కథతో సినిమా తీస్తే ప్రియాంకకు సంబంధించిన అన్ని విషయాలు బయటపెట్టొచ్చని ప్లాన్ కూడా వేశాడు. ఈ సినిమాకు `67 డేస్` అని పేరు కూడా ఖరారు చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన పీసీ వారిరువురికి నోటీసులు పంపడంతో అసీం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత కొన్ని రోజులకు ప్రియాంక మంచిది, గొప్ప నటి అంటూ అసీం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే!