: ఉద్యోగుల ర‌వాణా భ‌ద్ర‌త కోసం హైద్రాబాద్ పోలీసు శాఖ‌తో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ


త‌మ ఉద్యోగులు ప్ర‌యాణంలో ఉన్న‌పుడు ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే పోలీసులు వెంట‌నే స్పందించేలా ఉండేందుకు హైద్రాబాద్ పోలీసు శాఖ‌తో సింక్రొనీ ఫైనాన్షియ‌ల్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా త‌మ కంపెనీ ట్రాన్స్‌పోర్ట్ స‌ర్వీస్ టూల్‌ను హైద్రాబాద్ పోలీసు వారి `హాక్ ఐ` యాప్‌తో అనుసంధానం చేసింది. దీని ద్వారా త‌మ కంపెనీ వాహనాల‌ను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయ‌డంతో పాటు, ఉద్యోగుల‌కు ర‌వాణా ర‌క్ష‌ణ సౌక‌ర్యాలను త‌క్ష‌ణ‌మే అందించేందుకు వీలు క‌లుగుతుంది. ప్ర‌జ‌ల‌తో పోలీసులు మ‌రింత‌గా మ‌మేకం అయ్యేందుకు ఇలాంటి యాప్ అనుసంధాన సేవ‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని కంపెనీ అభిప్రాయ‌ప‌డింది. ఆప‌ద‌లో ఉన్న‌పుడు పోలీసుల స‌హాయం వెంట‌నే అంద‌డానికి డిసెంబ‌ర్ 2014లో `హాక్ ఐ` యాప్‌ను విడుద‌ల చేశారు.

  • Loading...

More Telugu News