: ఉత్తమ్ ది త్యాగాల కాంగ్రెస్ కాదు...భోగాల కాంగ్రెస్: కర్నె ప్రభాకర్
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ది త్యాగాల కాంగ్రెస్ కాదని, భోగాల కాంగ్రెస్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ మంత్రి కేటీఆర్ పై ఉత్తమ్ ఇటీవల చేసిన విమర్శలపై ఆయన మండిపడ్డారు. ‘కేటీఆర్ ది ఉద్యమ వారసత్వం. రాహుల్ గాంధీది కుటుంబ వారసత్వం. కేటీఆర్ బచ్చా కాదు, చిచ్చర పిడుగు’ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో హైదరాబాద్ ను నిరుద్యోగ హబ్ గా మార్చారని, నిరుద్యోగ యువతను సోమరిపోతుల్లా మార్చేందుకే నిరుద్యోగ భృతి గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పారే తప్పా, ఇంటికో ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదని ప్రభాకర్ అన్నారు.