: నాగాలాండ్ ముఖ్యమంత్రిగా టీఆర్ జెలియాంగ్ నియామకం
నాగాలాండ్ రాష్ట్రంలో ఐదు నెలలుగా అధికారంలో ఉన్న షుర్హోజెలీ లిజెట్సు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తూ, అదే సమయంలో నాగా పీపుల్స్ ఫ్రంట్ నేత టీఆర్ జెలియాంగ్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఆ రాష్ట్ర గవర్నర్ పీబీ ఆచార్య ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు 3 గం.లకు రాజ్ భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్న టీఆర్ జెలియాంగ్‌ను జూలై 22లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. గత ఫిబ్రవరిలో ఆదివాసీల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన టీఆర్ జెలియాంగ్ మళ్లీ ఆ పదవిని చేపట్టేందుకు గవర్నర్ ఆహ్వానించారు. ఈరోజు బలపరీక్షకు షుర్హోజెలీ లిజెట్సు హాజరుకాకపోవడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.