: సిట్ కార్యాలయంలో హంగామా సృష్టించిన సాయిరాం శంకర్... మీడియాతో గొడవ!
రహస్యంగా జరుగుతున్న తన అన్న పూరీ జగన్నాథ్ విచారణ గురించి అందరికీ తెలియజేస్తున్నారని ఆరోపిస్తూ, మీడియాపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నటుడు సాయిరాం శంకర్, అబ్కారీ శాఖ కార్యాలయంలో హంగామా చేశాడు. మీడియా ప్రతినిధులపైకి వెళ్లి, రిపోర్టర్ల సెల్ ఫోన్లు లాక్కొని వాటిల్లో కనిపించిన వీడియోలను చెరిపేశాడు. ఈ ఉదయం పూరీతో కలిసి సాయిరాం శంకర్ కూడా ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన సంగతి తెలిసిందే. పూరీని విచారణ గదిలోకి తీసుకెళ్లిన అధికారులు, వీరిని మాత్రం బయటే ఉంచారు. ఆ సమయంలో తీసిన పలు వీడియోలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.