: ఫ్లాష్ బ్యాక్: సిల్క్ స్మిత కొట్టడంతో.. షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిన షకీల!
శృంగార తార షకీలకు మలయాళ సినీ పరిశ్రమలో టాప్ హీరోకు ఉన్నంత క్రేజ్ ఉండేది. షకీల సినిమా విడుదల అవుతోందంటే... పెద్ద పెద్ద హీరోలు సైతం తమ సినిమాల విడుదలను వాయిదా వేసుకునేవారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకీల అప్పట్లో జరగిన ఓ ఘటన గురించి తెలిపింది. ఓ సినిమాలో తాను, సిల్క్ స్మిత ఇద్దరూ కలసి నటించామని ఆమె చెప్పింది. సినిమాలో షకీలను సిల్క్ స్మిత కొట్టే సన్నివేశం ఒకటి ఉందట. దీంతో, ఈ సీన్ కోసం రిహార్సల్స్ చేద్దామని స్మితను షకీల అడిగిందట. అయితే, దానికి రిహార్సల్ అవసరం లేదని, షూటింగ్ లో అదే వచ్చేస్తుందని స్మిత చెప్పిందట.
అయితే, షూటింగ్ సమయంలో నిజంగానే స్మిత కొట్టిందట. అంతేకాదు, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్లిపోయిందట. ఈ ఘటనతో షకీల చాలా హర్ట్ అయిందట. అవమానకరంగా భావించిన షకీల షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లి పోవడమే కాకుండా... సిల్క్ స్మిత ఉంటే తాను షూటింగ్ కు రానని నిర్మాతకు తెగేసి చెప్పిందట. అయితే, ఆ తర్వాత ఓ స్వీట్ బాక్స్ ను ఇచ్చి షకీలను కూల్ చేసిందట స్మిత. అప్పట్లో తనకున్న పాప్యులారిటీని చూసి ఓర్వలేకే, అసూయతో తనను స్మిత కొట్టిందని ఇప్పటికీ భావిస్తున్నట్టు షకీలా తెలిపింది.