: బౌలింగ్ కోచ్ భరత్ పై ఉమేష్ యాదవ్ స్పందన
టీమిండియా బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ ను బీసీసీఐ నియమించడం పట్ల ఓవైపు విమర్శలు చెలరేగుతున్నాయి. క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఎంపిక చేసిన జహీర్ ఖాన్ ను కన్సల్టెంట్ గా నియమిస్తూ, భరత్ ను బౌలింగ్ కోచ్ గా బీసీసీఐ నియమించింది. విమర్శల మాట అటుంచితే... టీమిండియా పేసర్ ఉమేష్ యాదవ్ మాత్రం భరత్ ను బౌలింగ్ కోచ్ గా నియమించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు. గతంలో భరత్ ఇచ్చిన సలహాల వల్లే బౌలింగ్ లో తాను నిలకడను సాధించానని ఉమేష్ చెప్పాడు. తన తప్పులను సరిదిద్దుకుని, విజయవంతం కావడానికి భరతే కారణమని తెలిపాడు.