: ఆ దృశ్యాలతో సినిమా వచ్చుంటే బాగుండేది!: 'దండుపాళ్యం' లీక్డ్ దృశ్యాలపై నటి సంజన


తన కొత్త చిత్రం 'దండుపాళ్యం-2'లో సెన్సార్ అనుమతించని పోలీసు విచారణ సన్నివేశాల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంపై నటి సంజన స్పందించింది. ఆ దృశ్యాలు తాను చేసినవేనని, పాత్రకు తగ్గట్టుగా ఉండాలనే దుస్తులు లేకుండా నటించానని చెప్పిన సంజన, సెన్సార్ ఆ సన్నివేశాలు అభ్యంతరకరమంటూ తొలగించిందని వెల్లడించింది. ఆ సన్నివేశాలతో కూడిన సినిమా విడుదలైతే తనకు ఎంతో మంచి పేరు వస్తుందని భావించానని, సెన్సార్ కట్ చేసిన దృశ్యాలు బహిర్గతం కావడం మాత్రం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సినిమాల్లో ఉండని ఈ దృశ్యాలకు ఎక్కువ ప్రచారం కల్పించవద్దని విజ్ఞప్తి చేసింది. కాగా, తొలి భాగంలో పూజా గాంధీ నటించిన పాత్రకు రెండో భాగంలో సంజనను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News