: ప్రతాప్ సి.రెడ్డి సంచలన ప్రకటన... జయలలిత మృతి విషయంలో విచారణకు సిద్ధమన్న ‘అపోలో’ చైర్మన్!


దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి విషయం మరోమారు తెరపైకి వచ్చింది. ఆమె మృతి విషయంలో ఎటువంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని మంగళవారం అపోలో ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి ప్రకటించారు. జయ మరణంపై అనుమానాలున్నాయని, విచారణ జరిపించాలని డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రతాప్ సి.రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జయలలితకు 75 రోజులపాటు అంతర్జాతీయ స్థాయిలో చికిత్స అందించినట్టు చెప్పారు. అందుకు సంబంధించిన రికార్డులన్నీ భద్రంగా ఉన్నట్టు తెలిపారు. జయకు చికిత్స విషయంలో ఎటువంటి రహస్యం లేదని, ఎవరి జోక్యమూ లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News