: చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్న భారత్‌


భారత్-చైనా సరిహద్దుల్లో నెల రోజులుగా ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్న‌ విష‌యం తెలిసిందే. డోక్లామ్‌లో చైనా అక్ర‌మంగా నిర్మిస్తోన్న ర‌హదారి నిర్మాణ ప‌నుల‌ని భార‌త్ అడ్డుకోవ‌డం, ఇరు దేశాల సైనికులు ఆ ప్రాంతం స‌మీపంలో భారీగా మోహ‌రించ‌డంతో భార‌త్ కీలక నిర్ణ‌యం తీసుకుంది. భారత్‌-టిబెటన్‌ సరిహద్దు దళం (ఐటీబీపీ) ఏడీజీ పదవిని భారత్‌ మళ్లీ పునరుద్ధరించింది. ఈ నిర్ణ‌యంపై సంబంధిత అధికారులు మాట్లాడుతూ... ఈ పదవిని 2014 ఫిబ్రవరిలో హోంశాఖ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కు అప్పగించిందని, ప్రస్తుతం నెల‌కొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ పదవిని హోంశాఖ తిరిగి ఐటీబీపీకి అప్పగించిందని తెలిపారు. 1986 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్‌ అధికారి ఆర్‌.కె.మిశ్రాను ఐటీబీపీ అదనపు డీజీగా నియమించిన‌ట్లు పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News