: కేంద్ర ప్రభుత్వంపై మండిపాటు.. రాజ్యసభ సభ్యత్వానికి మాయావతి రాజీనామా
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను ఆమె రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీకి పంపారు. ఈ రోజు రాజ్యసభలో తాను దళితుల గురించి మాట్లాడుతోంటే అందుకు అనుమతి ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. వారి గురించి మాట్లాడేందుకు తాను నిలబడగానే తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు అధికార పక్ష సభ్యులు పైకి లేచి నిలబడ్డారని ఆమె తెలిపారు. ఇది చాలా దురదృష్టకరమని చెప్పారు. దేశంలోని దళితులు వెనకబడిన వర్గాల వారి సమస్యలను ప్రస్తావించే అవకాశం రానప్పుడు తనకు రాజ్యసభలో కొనసాగే అధికారం లేదని ఆమె వ్యాఖ్యానించారు.