: భారీ వర్షం కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్‌ జామ్‌


హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మోండా మార్కెట్‌, పార్శీగుట్ట, చిలకలగూడ, పద్మారావునగర్‌, అడ్డగుట్ట, కార్ఖానా, బేగంపేట, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బొల్లారం, జవహర్‌నగర్‌, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండడంతో ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది.

సికింద్రాబాద్‌-బేగంపేట మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. న‌గ‌రంలోని మెహిదీ పట్నం, మాసబ్ ట్యాంక్ తో పాటు మ‌రికొన్ని ప్రాంతాల్లోనూ వాహ‌నాలు మెల్లిగా ముందుకు క‌దులుతున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అబిడ్స్‌, జూబ్లిహిల్స్‌లో కొన్ని వృక్షాలు నేల‌కూలాయి.

  • Loading...

More Telugu News