: అమరావతిలో సెక్రటేరియట్ ఉద్యోగుల విధులకు తీవ్ర ఆటంకం... గంటా చాంబర్ ఇలా మారింది!
భారీ వర్షాలకు అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలోని మంత్రుల చాంబర్లలోకి వర్షపు నీరు వచ్చిందన్న సంగతి తెలిసిందే. జలవనరుల శాఖ అధికారుల కార్యాలయం లోపలికి కూడా నీరు వచ్చి చేరింది. ఈ భవనాలు కొత్తవి కావడం, రెండు రోజులుగా వర్షాలు పడుతూ ఉండటంతో అనేక చోట్ల గోడలు చెమ్మగిల్లాయని, భవనాలు నానిపోవడంతో సీలింగ్ కొన్ని చోట్ల దెబ్బతిందని అధికారులు వివరణ ఇచ్చారు. ఇక మంత్రి గంటా శ్రీనివాస్ చాంబర్ పూర్తిగా నీటితో నిండిపోగా, బకెట్లతో నీటిని ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పలు విభాగాల్లోకి నీరు చేరడంతో ఉద్యోగులకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొన్ని గదుల్లో ఎంతమాత్రమూ పని చేసే వీలు లేకపోవడంతో, విధులను నిలిపివేయాల్సి వచ్చిందని తెలుస్తోంది.