: అమరావతిలో వర్షాలకు మంత్రులు దేవినేని, గంటా చాంబర్లలోకి వరదనీరు... చిత్రాలు చూడండి!


నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలోకి మరోసారి వర్షపు నీరు వచ్చి చేరింది. గతంలో విపక్ష నేత జగన్ చాంబర్ లోకి వర్షపు నీరు చేరగా, ఈ దఫా మంత్రుల చాంబర్ల వంతు అయింది. దేవినేని ఉమ, గంటా శ్రీనివాస్ చాంబర్లలోకి నీరు వచ్చి చేరింది. నీటిలో నానిన సీలింగ్ పెచ్చులు ఊడి పడ్డాయని కూడా సమాచారం అందుతోంది. విషయం తెలుసుకున్న అధికారులు ఆగమేఘాల మీద చాంబర్ల వద్దకు వచ్చి ఏం జరిగిందన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు.

కాగా, ఈ భవంతులను నాసిరకంగా నిర్మించారని, అందువల్లే తమ నేత చాంబర్ లోకి వర్షపు నీరు వచ్చిందని వైకాపా నేతలు ఆరోపించిన వేళ, కావాలనే ఏసీ పైపులను తొలగించిన కారణంగా నీరు వచ్చిందని అప్పట్లో అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక తాజా ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News