: మాట్లాడనిస్తారా? రాజీనామా చేసి వెళ్లిపోవాలా?: పార్లమెంటులో మాయావతి తీవ్ర ఆగ్రహం


ఉత్తరప్రదేశ్ లో దళితులపై అత్యాచారాలు పెరుగుతున్నాయని ఆరోపిస్తూ, ఈ ఉదయం రాజ్యసభలో విపక్ష పార్టీలు ఆందోళన చేస్తున్న వేళ, మాయావతి తన ఆగ్రహాన్ని ప్రదర్శించి, విసురుగా బయటకు వెళ్లిపోయారు. ఈ విషయంలో తాను మాట్లాడేందుకు అనుమతించాలని పదే పదే కోరినప్పటికీ, అనుమతి లభించలేదు. దీంతో తనను మాట్లాడనివ్వకుంటే, రాజీనామా చేసి వెళ్లిపోతానంటూ, ఆమె విసురుగా బయటకు వెళ్లిపోయారు. మాయావతి బయటకు వెళుతున్న వేళ, పలువురు విపక్ష సభ్యులు ఆమెను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. షహరాన్ పూర్ లో ఇటీవల జరిగిన కొన్ని ఉదంతాలను ప్రస్తావించిన మాయావతి, వాటిపై చర్చకు అనుమతించాలని ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే పట్టుబట్టారు. దీనిపై చర్చకు అనుమతించేది లేదని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తేల్చి చెప్పిన వేళ, ఈ ఘటన జరిగింది.

  • Loading...

More Telugu News