: వెంకయ్య పంచే ఎందుకు కడతారు? అగ్రనేతగా ఎదిగినా మారని అలవాటు!
వెంకయ్యనాయుడు అంటే తొలుత గుర్తొచ్చేది పంచెకట్టే. సాధారణంగా తమిళులే ఎక్కువగా పంచెకట్టుతో కనిపిస్తారు. మరి తెలుగువాడైన వెంకయ్య కూడా పంచెకట్టు లేకుండా కనిపించరెందుకని? దీనికో కారణముంది. వెంకయ్య నాయుడు జన్మించిన నెల్లూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉంది. దీంతో ఆ ప్రభావం నెల్లూరు జిల్లాలోనూ కనిపిస్తుంటుంది. జిల్లాలో కూడా ఎక్కువ మంది లుంగీ (అడ్డపంచె)తో కనిపిస్తారు. ఆ ప్రభావమే వెంకయ్యపైనా పడింది. దేశ రాజకీయాల్లో ఎంత ఎదిగినా ఆయన పంచెకట్టును మాత్రం మానలేదు. అంతేకాదు.. ఆయన మాటల్లో నెల్లూరు యాస, ప్రాస అన్నీ ఇప్పటికీ కనిపిస్తుంటాయి. ఆయన వాగ్ధాటికి ప్రతిపక్ష నేతలు సైతం మంత్రముగ్ధులు అయిపోతుంటారు.