: డ్రగ్స్ కేసులో విచారణకు 12 మంది ఆయా తేదీల్లో రావాలి.. ఈ నెల 24న రవితేజ హాజరు కావాల్సిందే: సిట్
టాలీవుడ్‌లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో ఇప్పటికీ నోటీసులు అందుకోలేని పలువురు టాలీవుడ్ ప్రముఖులకి సిట్ తాజాగా నోటీసులు జారీ చేసింది. నోటీసులు పంపిన 12 మంది ఏయే రోజుల్లో హాజరుకావాలో తెలిపింది. తమకు నోటీసులు అందలేదని చెప్పుకున్న వారు కూడా ఈ 12 మందిలో ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో లేని దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి తాజాగా సిట్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఆయనను ఎల్లుండి విచారణకు హాజరుకావాలని చెప్పిన సిట్ అధికారులు... ఈ నెల 20న ఛార్మిని, 21న ముమైత్ ఖాన్‌ని, 22న సుబ్బరాజుని, 23న కెమెరామెన్ శ్యాం కె.నాయుడుని, 24న హీరో రవితేజను, 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న నవదీప్‌ను, 27న తరుణ్‌ను, 28న నందు ఆ తరువాతి తేదీకి తనీష్‌ను ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి రావాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు ఉదయం 10.30 గంటలకు ఈ విచారణ ప్రారంభం కానుంది.