: 'దివాకర్ ట్రావెల్స్'లో ఇలాంటి ఘటనలు జరిగితే అనుమతిస్తారా?: జేసీ దివాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు!


విమానయాన సంస్థలు తనపై నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో దివాకర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. ‘దివాకర్ ట్రావెల్స్ లో ఇలాంటి ఘటనలు జరిగితే అనుమతిస్తారా?’ అని జేసీని హైకోర్టు ప్రశ్నించింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున జేసీని విమానాల్లో ప్రయాణించేందుకు తాత్కాలికంగా నైనా అనుమతించాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. ఈ విషయమై విమానయాన సంస్థల వాదనలు వినకుండా, ఆదేశాలు ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. కాగా, తనపై విమానయాన సంస్థలు నిషేధం విధించిన నేపథ్యంలో.. రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో జేసీ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News