: శ్రీలంక టూర్.. మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్
శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ కు అనూహ్యంగా చోటు దక్కింది. ఓపెనర్ మురళీ విజయ్ గాయంతో బాధపడుతుండటంతో... ధావన్ ను జట్టులోకి ఎంపిక చేస్తూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకుంది. మురళీ విజయ్ కు మణికట్టు గాయం ఇంకా తగ్గలేదు. మూడు నెలల క్రితం మురళీ తన మణికట్టుకు ఆపరేషన్ చేయించుకున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో... అతన్ని సెలక్టర్లు పక్కనబెట్టేశారు. ఈ నెల 26వ తేదీ నుంచి శ్రీలంకతో తొలి టెస్టు జరగనుంది. ఈ సిరీస్ లో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 జరగనున్నాయి. 2009 తర్వాత ఇరు దేశాల మధ్య తొలిసారి పూర్తి స్థాయి సిరీస్ జరగబోతోంది.