: రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో వంద శాతం పోలింగ్ న‌మోదు


67 మంది ఎమ్మెల్యేలు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డంతో రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో వంద శాతం పోలింగ్ న‌మోదైన రాష్ట్రంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ నిలిచింది. నిజానికి 68 ఎమ్మెల్యేలు ఉండే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే క‌ర‌ణ్ సింగ్ మ‌ర‌ణించ‌డంతో ఒక సీటు ఖాళీగా మిగిలిపోయింది. చీఫ్ పార్ల‌మెంట‌రీ సెక్ర‌ట‌రీ ఐడీ ల‌ఖ‌న్‌పాల్ త‌న ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డంతో ఇక్క‌డ పోలింగ్ ప్రారంభ‌మైంది. త‌ర్వాత వ‌రుస‌గా ముఖ్య‌మంత్రి వీర‌భ‌ద్ర సింగ్‌తో పాటు 35 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 28 మంది బీజీపీ ఎమ్మెల్యేలు, ఒక స్వ‌తంత్ర అభ్య‌ర్థి త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు.

  • Loading...

More Telugu News