: ముద్రగడ పాదయాత్రకు అనుమతివ్వలేదు: డీజీపీ సాంబశివరావు


కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఈ నెల 26వ తేదీ నుంచి తలపెట్టనున్న పాదయాత్రకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిషేధాజ్ఞలు విధించినా పాదయాత్ర కొనసాగిస్తానని ముద్రగడ అనడం సబబు కాదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తామంటే పోలీసులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. తుని విధ్వంసం ఘటనకు సంబంధించి పదిరోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News