: హైదరాబాద్ లో భారీ వర్షం.. నత్తనడకన ముందుకు సాగుతున్న వాహనాలు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకపూల్, హిమాయత్ నగర్, ఆర్టీసీ ఎక్స్ రోడ్, చందానగర్, మియాపూర్, ఎస్సార్ నగర్, యూసఫ్‌గూడ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. బేగం బజార్, సుల్తాన్ బజార్, కోఠి, ఆబిడ్స్, చార్మినార్, అఫ్జల్ గంజ్ లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా పలు రహదారులపై వాహనాలు నత్తనడకన ముందుకు సాగుతున్నాయి.