: ఆ పరిస్థితే ఉంటే, పార్టీ ఆ విధంగా భావిస్తే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: రోజా


వైసీపీలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉందని... లేకపోతే రానున్న ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ అధినేత జగన్ కు ఆయన స్పష్టం చేసినట్టుగా వార్తలొస్తున్నాయి. అంతేకాదు, ఏయే నియోజక వర్గాల్లో అభ్యర్థులు బలహీనంగా ఉన్నోరో కూడా ఆయన ఓ లిస్టును జగన్ కు ఇచ్చారట. దీంతో, ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు ఉన్నాయో అనే టెన్షన్ నేతల్లో నెలకొంది.

ఈ నేపథ్యంలో, ఓ వార్తా ఛానల్ తో ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ, తాను ఓడిపోయే పరిస్థితి ఉంటే లేదా తాను ఓడిపోతానని పార్టీ భావిస్తే... వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆమె స్పష్టం చేశారు. పోటీ నుంచి తాను తప్పుకుంటానని తెలిపారు. తనకు ఎమ్మెల్యే కావాలనే ఆశ కంటే... వైసీపీ అధికారంలోకి రావాలని, జగన్ సీఎం కావాలనే ఆశే ఎక్కువ అని అన్నారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేసే క్రమంలో... ఓడిపోయే అవకాశాలున్న ప్రతి ఒక్కరు పోటీ నుంచి తప్పుకుంటారని చెప్పారు.

  • Loading...

More Telugu News