: హైదరాబాదు నుంచి వస్తుండగా మంత్రి ఆదినారాయణరెడ్డి కాన్వాయ్ లో ప్రమాదం!


ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి కాన్వాయ్ లోని కారు ప్రమాదానికి గురైంది. కోదాడ సమీపంలో కాన్వాయ్ వేగంగా వెళుతున్న వేళ, అదుపుతప్పిన ఓ వాహనం డివైడర్ ను ఢీకొంది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు గన్ మెన్లు, డ్రైవర్లకు స్వల్పగాయాలు కాగా, పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి ప్రాథమిక చికిత్స జరిగేంత వరకూ ఆసుపత్రిలోనే ఉన్న ఆదినారాయణరెడ్డి, ఆపై ఏపీ అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే నిమిత్తం హైదరాబాద్ నుంచి ఈ ఉదయం ఆదినారాయణరెడ్డి బయలుదేరగా మార్గమధ్యంలో ఈ ఘటన జరిగింది. కాగా, ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల్లో ఆదినారాయణరెడ్డి, తోట త్రిమూర్తులు మినహా మిగతా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన వర్గం ఎమ్మెల్యేలతో వచ్చిన వైకాపా అధినేత వైఎస్ జగన్ తన ఓటును వేశారు. వైకాపా ఎమ్మెల్యేల ఓటింగ్ కూడా ముగిసింది. 

  • Loading...

More Telugu News