: బీరు కింద ఒల‌క‌కుండా.. బాల్ క్యాచ్ ప‌ట్టిన అభిమాని... వీడియో చూడండి


నెమ్మ‌దిగా సాగుతున్న క్రికెట్ మ్యాచ్‌ను చూడాలంటే ఎవ‌రికైనా బోర్ కొడుతుంది. అందులోనూ చిన్న చిన్న వ‌ర్ష‌పు చినుకులు ప‌డుతూ, ఏ మాత్రం ఉత్సాహాన్నివ్వని మ్యాచ్ చూడాలంటే ఇంకా చిరాకు. ఆ స‌మ‌యంలో స్టాండ్స్‌లో కూర్చున్న ఓ ప్రేక్ష‌కుడు అనుకోకుండా చేసిన ప‌ని అంద‌రిలోనూ ఉత్సాహాన్ని నింపింది. తీరిగ్గా అటూ ఇటూ తిరుగుతూ బీర్ తాగుతున్న అభిమాని, బ్యాట్స్‌మెన్ అటుగా కొట్టిన బంతిని ఒంటి చేత్తో ప‌ట్టుకున్నాడు. ఇందులో విష‌య‌మేంటంటే... అత‌ని చేతిలో ఉన్న బీర్ ఒక్క చుక్క కూడా కింద ఒల‌క‌లేదు. చేతిలో ఉన్న బీరు ఒల‌క‌కుండా, త‌డిగా ఉన్న బంతిని ఒంటి చేత్తో క్యాచ్ పట్టడం చూసి, అక్క‌డున్న ప్రేక్ష‌కులంతా ఉత్సాహాన్ని ఆపుకోలేక‌ లేచి చ‌ప్ప‌ట్లు కొట్టారు. ఇంగ్లండ్‌లో గ్లామోర్గ‌న్‌, సోమ‌ర్‌సెట్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న క్రికెట్ మ్యాచ్‌లో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News