: 23న ప్రణబ్‌కు ఘనంగా వీడ్కోలు.. వినూత్న బహుమతితో సెండాఫ్!
ఈనెల 24తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియనుంది. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఘనంగా వీడ్కోలు పలకాలని ఎంపీలు నిర్ణయించారు. 23న నిర్వహించనున్న వీడ్కోలు సమావేశంలో ఎంపీలందరూ కలిసి ప్రణబ్‌కు ఓ వినూత్న బహుమతిని ఇచ్చి తమ గౌరవాన్ని చాటుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంపీలందరూ సంతకం చేసిన అందమైన పుస్తకాన్ని ఆరోజున ప్రణబ్‌కు గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్టు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తెలిపారు.