: వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు 'కోటయ్యా' అంటూ ఆప్యాయంగా పిలిచేవారు!: కోట శ్రీనివాసరావు
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనను 'కోటయ్యా' అంటూ ఆప్యాయంగా పిలిచేవారని ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు గుర్తు చేసుకున్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను కనబడినప్పుడల్లా రాజశేఖర్ రెడ్డిగారు ఒక మాట అనేవారు. ‘నువ్వు రాజకీయాలకు బాగా పనికొస్తావయ్యా! బట్, యు ఆర్ ఇన్ రాంగ్ పార్టీ’ అనేవారు. నేనేమో..ఆ మాటలకు నవ్వుకునేవాడిని...
నాకు బాగా సంతోషమనిపించిన విషయం పద్మశ్రీ పురస్కారం రావడం. నేను బాధపడ్డ సంఘటన.. పర్సనల్ గా నా కొడుకు చనిపోవడం. ప్రొఫెనల్ గా చెప్పాలంటే.. కొన్నేళ్ల క్రితం కోడి రామకృష్ణ దర్శకత్వంలో 'పంజరం' అనే సినిమా తీశారు. ఇందులో, చాలా మంచి వేషం నాకు వచ్చింది. 102..103 జ్వరంతో ఉన్నప్పటికీ ఆ సినిమాలో యాక్టు చేశాను. అయితే, ఆ సినిమా రెండుమూడ్రోజుల కంటే ఎక్కువ ఆడలేదు. ఆ రోజున ఏడ్చేశాను’ అని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.