: రాహుల్ జీ! ఈ దాదాగిరిని మీరు సమర్థిస్తున్నారా?: బాలీవుడ్ దర్శకుడు మధుర్ భండార్కర్


మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ నాటి ఘటనల ఆధారంగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ తెరకెక్కిస్తున్న 'ఇందు సర్కార్' చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తలపెట్టిన చిత్ర ప్రచార కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కార్యాలయానికి  మధుర్ భండార్కర్ ఓ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ లో తన  ఆవేదన వ్యక్తం చేసిన భండార్కర్, కొన్ని ప్రశ్నలూ సంధించారు. ‘పుణె కాన్ఫరెన్స్ తర్వాత నాగపూర్ లో ఈ రోజు జరగాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ ను రద్దు చేసుకున్నాను. దాదాగిరిని మీరు సమర్థిస్తున్నారా?  భావ ప్రకటనా స్వేచ్ఛ నాకు లేదా?’ అని ఆ ట్వీట్ లో ప్రశ్నించారు. దీంతో పాటు, కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్న ఓ వీడియోను ఆయన పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News