: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు?
ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ పదవికి వెంకయ్యనాయుడు అన్నివిధాలా సమర్థుడనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నట్టు సమాచారం. వెంకయ్యనాయుడు అయితేనే, భాగస్వామ్య పక్షాలన్నీ ఆమోదిస్తాయనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ కీలక నేతగా సంక్షోభ సమయాల్లో వెంకయ్యనాయుడు పోషించిన పాత్రను బీజేపీ పరిగణనలోకి తీసుకుందని సమాచారం. వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వంపై ఎన్డీఏ పక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని, ఏ రకంగా చూసినా కూడా ఉపరాష్ట్రపతి పదవికి ఆయనే అర్హుడని, ఆ పదవికి వన్నె తెస్తారనే సమష్టి అభిప్రాయానికి ఎన్డీఏ పక్షాలు వచ్చాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.