: రాష్ట్రపతి ప్రణబ్ కు అచ్చొచ్చిన సంఖ్య ‘13‘!
రాష్ట్రపతి ప్రణబ్ పదవీకాలం ఈ నెల 24తో ముగియనుంది. ప్రణబ్ కు ఉన్నంత పాలనా అనుభవం ఇంతకు ముందున్న ఏ రాష్ట్రపతికీ లేదు. ఈ నేపథ్యంలో ఆయన గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు.
* గతంలో పలు కీలక మంత్రిత్వశాఖలు నిర్వహించారు.
* ప్రణబ్ అదృష్ట సంఖ్య ‘13’ అని చెప్పవచ్చు. 1957 జులై 13న ఆయన వివాహం చేసుకున్నారు.
* ఎంపీగా, కేంద్రమంత్రిగా ఆయన ఉన్న సమయంలో ఢిల్లీలోని తల్కతోర రోడ్డులోని 13వ నెంబరు ఇంట్లో నివసించేవారు.
* లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంట్ లోని 13వ నెంబరు గది ఆయన కార్యాలయం.
* నాడు రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ నామినేషన్ దాఖలు చేసిన తేదీ 2012 జూన్ 13.
* రాష్ట్రపతి అభ్యర్థిగా నాడు ఆయన సాధించిన ఓట్ల మెజారిటీ 7,13,763. ఇందులోనూ, ‘13’ ఉండటం గమనార్హం.