: మా డాడీకి ఎలాంటి లింకులు లేవు... నిందలేయొద్దని హెచ్చరించిన పూరీ జగన్నాథ్ కుమార్తె పవిత్ర
టాలీవుడ్ డ్రగ్స్ వివాదంలో తన తండ్రి, ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పేరు రావడంపై, ఆయన కుమార్తె పవిత్ర స్పందించింది. నిజాలు తెలుసుకోకుండా నిందలు వేయవద్దని వేడుకుంది. తన తండ్రి సెలబ్రిటీ కావడంతోనే ఆయనపై పుకార్లు పుట్టిస్తున్నారని, ఈ తరహా చర్యలు సరైనవి కావంటూ, ఓ మాట అనేముందు ఆ కుటుంబం గౌరవ మర్యాదల గురించి కూడా ఆలోచించాలని సూచించింది. పనీ పాటా లేకుండా పిచ్చి మాటలు మాట్లాడేవారే తన తండ్రిపై ఆరోపణలు చేస్తున్నారని, తన తండ్రి ఉన్నత లక్ష్యాలతో కష్టపడి పని చేసే వ్యక్తని చెప్పుకొచ్చింది. డ్రగ్స్ విషయంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని, ఈ విషయంలో ఎవరైనా మాట్లాడాలంటే, జాగ్రత్తగా మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చింది పవిత్ర.