: ఈ ఫోన్‌ను కొనేవారు లేక మూతపడే స్థితికి చేరుకున్న కంపెనీ.. ధర జస్ట్ రూ.30 లక్షలే!
బ్రిటన్‌కు చెందిన లగ్జరీ ఫోన్ మేకర్ ‘వెర్టు’ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ కంపెనీ తయారు చేసే ఫోన్ల ఖరీదు 46,600 డాలర్లు (దాదాపు రూ.30 లక్షలు). ఫోన్ తయారీలో 18 కేరెట్ల బంగారం, రత్నాలు ఉపయోగిస్తుంది. అయితే ఈ హై ఎండ్ ఫోన్లను కొనేవారు కరువవడంతో కంపెనీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. అంతేకాదు దాదాపు 200 మంది వరకు ఉద్యోగాలు కూడా కోల్పోయారు. 1998లో ఈ కంపెనీని ఫిన్లాండ్కు చెందిన మొబైల్ మేకర్ నోకియా స్థాపించింది. అయితే 2012లో దీనిని విక్రయించింది. కంపెనీని సొంతం చేసుకున్న వెర్టు ఫోన్లలో నోకియా ఉపయోగించే సింబియాన్ ఆపరేటింగ్ సిస్టంకు చెక్ చెప్పి గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌ను ఉపయోగిస్తోంది.