: చెన్నైలోని టీటీడీ ఆలయంలోకి నగ్న అఘోరాలు... సంప్రోక్షణ!


తమిళనాడు రాజధాని చెన్నైలో టీటీడీ నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలోకి నగ్నంగా ఉన్న అఘోరాలు ప్రవేశించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఓ నగ్న సాధువుతో పాటు, కొద్దిగా దుస్తులు ధరించిన మరో ముగ్గురు, టీటీడీ మాజీ సభ్యుడు సత్యనారాయణరావు, తమిళనాడు బీజేపీ ప్రోటోకాల్‌ ప్రతినిధి శంకర్‌ లతో కలసి దేవాలయంలోకి రాగా, ఆపై ఆలయంలో సంప్రోక్షణ జరిపి శుద్ధి చేయాల్సి వచ్చింది.

వాస్తవానికి ఆగమ శాస్త్రాల ప్రకారం, నగ్న స్వాములకు దర్శనానికి ఎటువంటి అనుమతులూ ఉండవు. అయితే, టీటీడీ సభ్యుడు, ఓ మాజీ సభ్యుడు, స్థానిక సలహా మండలి చైర్మన్ తదితరులు వెంటబెట్టుకుని రావడంతో, నిబంధనలకు విరుద్ధమైనా, వారికి దర్శనం, తీర్థప్రసాదాలు అందించక తప్పలేదని అర్చకులు చెబుతున్నారు. ఆలయ పవిత్రత చెడిపోయిందని భక్తుల్లో ప్రచారం జరుగగా, సంప్రోక్షణ కోసం ఆలయాన్ని మూసివేసిన అర్చకులు, ఇది అణివార ఆస్థాన కార్యక్రమమని, ప్రతియేటా జరిగేదని వివరణ ఇవ్వడం గమనార్హం. ఈ ఘటన శనివారం నాడు జరుగగా, ఆదివారం నాడు యథావిధిగా పూజలు, సేవలు సాగుతాయని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News